Saturday, March 9, 2019

కాల్ సెంటర్లు చురుగ్గా పనిచేయాలి…

కర్నూలు న్యూస్‌టుడే:
* కాల్‌ సెంటర్లు చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు…
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాలో ఓటరు తమ పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్లు చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వెలగపూడిలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. జిల్లాలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్లు, ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ మొదటి దశ పరిశీలన, సీ జిల్, సువిధ యాప్‌ బృందాల పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. ఓటర్లకు తగిన సమాచారం అందించి సమస్యలను పరిష్కరించే క్రమంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేసిన 1950 నంబరు కాల్‌ సెంటర్లు చురుగ్గా పనిచేసేలా నోడల్‌ అధికారులైన ఆయా జిల్లాల డీఆర్వోలు ప్రధాన భూమిక పోషించాలన్నారు.

No comments:

Post a Comment