Saturday, March 9, 2019

నాలుగు లారీల్లోని గ్రానైట్‌ పాలిషింగ్‌ రాళ్లు….

అద్దంకి, న్యూస్‌టుడే:
  • ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీల్లో రవాణా చేస్తున్న గ్రానైట్‌ రాళ్లను కొలతలు వేసిన తర్వాతనే అపరాధ రుసుం విధించనున్నట్టు విజిలెన్స్‌ సీఐ భూషణం తెలిపారు.
  • గ్రానైట్‌ పాలిషింగ్‌ రాళ్లతో వెళ్తున్న నాలుగు లారీలను బల్లికురవ- సంతమాగులూరు మధ్య శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
  • అనంతరం వాటిని అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌ గ్యారేజీ ఆవరణకు తరలించారు.
విచారణలో నాలుగు లారీల్లోని గ్రానైట్‌ పాలిషింగ్‌ రాళ్లు మార్టూరు నుంచి ముంబాయి వంటి నగరాలకు తరలి వెళ్తున్నట్టు గుర్తించామన్నారు. రెండు రోజులు సెలవులు అయినందున వాటి యజమానులు సోమవారం ఒంగోలులోని కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయా లారీల్లోని సరకును మైనింగ్‌ శాఖ సిబ్బందితో కొలతలు వేయించి అనంతరం అపరాధ రుసుం విధించనున్నట్టు చెప్పారు. పన్నుల శాఖ వాణిజ్య అధికారులకు కూడా వేబిల్లుల విషయమై నివేదిక అందిస్తామని, తద్వారా వారూ విచారణ చేపడతారన్నారు. ఒక్కో లారీలో రూ.రెండు లక్షల చొప్పున మొత్తం రూ.ఎనిమిది లక్షల వరకు అపరాధ రుసుం వసూలు చేసే అవకాశం ఉందని విజిలెన్స్‌ .

No comments:

Post a Comment