హైదరాబాద్ న్యూస్‌టుడే:
- ఎమ్మెల్యేలదే బాధ్యత
- పాతవారిలో ఒకరిద్దరిని మారుస్తా
- టికెట్ రానివారికి పార్టీలో బాధ్యతలు
- 70% ఓట్లు మనకే
- అదే ఎమ్మెల్యే భవిష్యత్తుకు కొలమానం
- ప్రచారానికి నేనొస్తా
- తెరాస ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని, సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిద్దరిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తామని, టిక్కెట్ రానివారి సేవలను పార్టీకోసం వినియోగించుకుంటామని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకి, కూటమికి సంపూర్ణమెజారిటీ రాదని.. టీఆర్‌ఎస్ జాతీయరాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోతున్నదన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీలకంటే అత్యధికంగా ప్రతి నియోజకవర్గంలోనూ భారీ మెజారిటీలు రావాలి.. ప్రతి బూత్‌లో నూ ఓటింగ్ పెరగాలి అని సీఎం ఈ సందర్భంగా నిర్దేశించారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు. ప్రతి బూత్‌లో 70 శాతం ఓటింగ్ టీఆర్‌ఎస్ వైపు నిలిచేలా ప్రజలను కలిసి మెప్పించాలన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని, ఇవి కాకుండా నియోజకవర్గాల స్థాయిలో మినీబహిరంగసభలు జిల్లామంత్రులు, ఎంపీ అభ్యర్ధులతో నిర్వహించుకోవాలని సీఎం సూచించారు. తాను కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానన్నారు. రెండురోజుల్లో పార్టీ అభ్యర్ధులను కూడా ప్రకటిస్తానని, గతంలో ఉన్న అభ్యర్ధులలో ఒకరిద్దరిని మారుస్తామన్నారు. సీటుదక్కని ఎంపీలను పార్టీసేవకు వినియోగించుకుంటామని, భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తామని సీఎం ప్రకటించారు.
No comments:
Post a Comment