Monday, March 11, 2019

ఎన్నికల యుద్ధానికి జనసేన రె”ఢీ” ….


అమరావతి న్యూస్‌టుడే:
  • నేడో రేపో తొలి జాబితా
  • వామపక్షాలతో సీట్ల సర్దుబాట్లు
  • రాజమండ్రి ఎంపీ సీటుకు ఆకుల
  • అమలాపురానికి డి.ఎం.ఆర్‌.శేఖర్‌
  • ఖరారు చేసిన జనసేనాని పవన్‌
ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగిరం చేసింది. తొలి విడత జాబితాకు సంబంధిం చిన అభ్యర్ధుల ఎంపిక తుది దశకు చేరింది. ఈనెల 12 లేదా 13న తొలి విడత జాబితాలోని అభ్యర్థుల వివరాలను జన సేనాని పవన్‌కల్యాణ్‌ ప్రకటించనున్నారు. కాగా సోమవారం రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్‌ స్ధానాలకు అభ్యర్ధు లను పవన్‌కల్యాణ్‌ స్వయంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకటించారు. తొలి విడతగా 32 అసెంబ్లి అభ్యర్ధులతో పాటు మరో ఏడుగురు ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్ధులను నేడు లేదా రేపు ప్రకటించేందు కు పవన్‌కల్యాణ్‌ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.  గత కొద్ది రోజులుగా సీపీఎం,సీపీఐ పార్టీల రాష్ట్ర నేతలతో సీరియస్‌గా సమాలోచనలు చేస్తున్న జనసేనాని సోమవారం కూడా వామపక్ష నేతలతో పొత్తుల గురించి సుదీర్ఘంగా చర్చించారు.సీట్ల విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. వామపక్షాల కోరుతున్న సీట్ల విషయంలో చర్చల వల్లనే అభ్యర్ధుల ప్రకటన మ ంగళవారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో 30 రోజుల గడువు మాత్రమే ఉండడంతో అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులతో పాటు పార్టీ ముఖ్యలు నాదెండ్ల మనోహర్‌ తదితర నేతలతో సీరియస్‌గా సమాలోచనలు నిర్వహించారు.

No comments:

Post a Comment