అమరావతి న్యూస్‌టుడే:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ రోజు జరిగే ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్‌-3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి సెట్‌-3 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. పరీక్షా కేంద్రాలలో అధికారులు నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందే రావాలని అధికారులు సూచిస్తున్నారు.