గుంటూరు న్యూస్‌టుడే:
- త్వరలోనే మహిళా డ్రైవర్లు వస్తారు. అది ఎంతో దూరం లేదు.
- అన్ని రంగాలలోనే రాణిస్తున్న మహిళలు.
మహిళల ఆత్మ గౌరవానికి టీడీపీ ముందడుగు వేసిందని తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ప్రజావేదికలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డ్వాక్రా వంటి శక్తివంతమైన సంఘాలు ఎక్కడా లేవన్నారు. త్వరలోనే మహిళా డ్రైవర్లు వస్తారు. అది ఎంతో దూరం లేదన్నారు. భవిష్యత్ లో డ్వాక్రా సంఘాల ద్వారా అనేక కార్యక్రమాలు చేయిస్తామన్నారు. కోటిమంది ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇస్తామన్నారు. పూర్తిగా వడ్డీలేని రుణాలు ఇస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించవచ్చన్నారు. లక్షా 97 వేల మంది మహిళలకు ఆధునిక పనిముట్లు ఇచ్చామన్నారు.

No comments:
Post a Comment