Thursday, March 21, 2019

నిరంతరం మీ సేవకే అంకితం.

గుంటూరుజిల్లా:న్యూస్‌టుడే: 
‘ ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి.. బార్ అసోసియేషన్‌లో ప్రచారం..
కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజక వర్గ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి కె ఎస్ లక్ష్మణరావు బుధవారం జిల్లా కోర్టులోనూ, బార్ అసోసియేషన్‌లో ప్రచారం నిర్వహించారు. పలువురు లాయర్లతో కలిసి ఆయన కోర్టులోని గ్రాడ్యుయేట్ ఓటర్లను, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి తదితరులను కలిసి ఓట్లు అభ్యర్ధించారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడూ,  తర్వాత కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై పనిచేస్తున్నానన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్  రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ నీతి, నిజాయితీతో విలువలకు కట్టుబడి పనిచేసే లక్ష్మణరావును ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కె.ఎస్ తో పాటు ప్రచారంలో పాల్గొన్న వారిలో న్యాయ వాదులు, ఐలు నాయకులు నీలం శంకరరావు, ఇల్లా మధుబాబు, జి. శేషగిరి, రవికుమార్, రామ్మోహనరావు, తదితరులున్నారు.

No comments:

Post a Comment