గుంటూరుజిల్లా: న్యూస్ టుడే:
* ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణి.. ఏపీతో పాటు తెలంగాణలోను పోటీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పొత్తుకు తెరలేచింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ (టీఎస్పీ) అధినేత్రి మాయావతి ఈరోజు ప్రకటించారు. యూపీలోని లక్నో్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ తో కలిసి మయావతి మాట్లాడారు. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీపై అంగీకారం కుదిరిందని మాయావతి తెలిపారు. త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికలప్రచారాన్ని ప్రారంభిస్తామని అన్నారు. పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు అభిలషించారు. ఏపీతో పాటు తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో కలిసి పోటీచేస్తామని అన్నారు. కాగా, ఈ పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లను బీఎస్సీకి కేటాయించిదన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 32 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్‌సభ సభ్యులతో జనసేన తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment