న్యూస్ టూడే:
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ బుమ్రాలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ టాప్ స్థానాలను కాపాడుకున్నారు. ఐసీసీ ఆదివారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో చేసిన 310 పరుగుల తోడ్పాటుతో అగ్ర స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 202 పరుగులు చేసి రెండో స్థానాన్ని రక్షిం చుకున్నాడు.కేదార్ జాదవ్ ఆల్‌రౌండ్ ప్రతిభ అతన్ని 11 స్థానాలు ఎగబాకేలా చేసి తన కెరియర్ బెస్ట్ 24కు చేర్చింది. ఆసీస్‌తో సిరీస్‌ను భారత్ 2-3తో చేజార్చుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 4 స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఇటీవల శ్రీలంకతో ఆడిన వన్డే సిరీస్‌ను 5-0తో గెలచుకోవడంలో డికాక్ తన అద్భుత బ్యాటింగ్‌తో కీలక పాత్ర పోషించాడు. వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ అయిన డికాక్ ఈ సిరీస్‌లో 353 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలున్నాయి. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మూడో స్థానానికి పెరిగాడు.
No comments:
Post a Comment