Thursday, March 7, 2019

భోజనం అందక.. ఆకలితో విలవిల…..

విశాఖ న్యూస్‌టుడే:
  • కొన్ని స్కూళ్లకు అసలు భోజనాలు రాలేదు.
  • మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిల్లలకు భోజనం
భీమిలి మండలం దాకమర్రి సమీపంలోని మోదవలస వద్దఉన్న నవప్రయాస సంస్థ ఆధ్వర్యంలో ప్రతీరోజు భోజనాలను తయారుచేసి మధ్యాహ్నం 12 గంటల సమయానికి భీమిలి మండలంలోని పాఠశాలలకు సరఫరా చేస్తుంటారు. ఆయా పాఠశాలల్లో రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యార్థులు భోజనాలు చేస్తుంటారు. కానీ ఆటోల ద్వారా రావాల్సిన భోజనాల క్యారేజీలు చేరకపోవడంతో పాఠశాల వర్గాలు వాకబు చేశాయి. భోజన సమయం దాటిపోవడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను ఇళ్లకు పంపివేశారు. హాస్టల్‌ విద్యార్థులను ఆయా వసతిగృహాలకు పంపగా అక్కడ వంట పూర్తిచేసి పిల్లలకు వడ్డించేసరికి సాయంత్రం 5 గంటలైంది. భీమిలి సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ హైస్కూలు, సీబీఎం ఎయిడెడ్‌ హైస్కూలు, పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ హైస్కూలు, ఝాన్సీ లక్ష్మీభాయి మున్సిపల్‌ యూపీ స్కూళ్లకు అసలు భోజనాలు రాలేదు. మరికొన్నింటికి ఆలస్యంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత  రావడంతో ఎలాగోలా ఆకలిని తీర్చుకున్నారు. భీమిలి పరిధిలో పది పాఠశాలల్లో చదువుతోన్న 1,700 మంది విద్యార్థులు భోజనం విషయంలో బుధవారం ఇబ్బందులు పడ్డారన్నారు.

No comments:

Post a Comment