Sunday, March 10, 2019

బిల్వ వృక్షం….


శివునికి పీతిపాత్రమైన చెట్టు బిల్వం. ఆ నమ్మకం బిల్వానికి ఎంతో పవిత్రతను, గౌరవాన్ని తెచ్చింది. శివాలయంలో తప్పనిసరిగా  కనిపించడంవల్ల కూడా బిల్వవృక్షం పవిత్రత పెరిగింది. ఆ చెట్టులోని ఆకులు, కాయలు, పండ్లు…ఇలా ప్రతిఒక్కభాగం శివునికి ప్రీతిపాత్రమే. శివుని పూజించేందుకు బిల్వపత్రాలనే వాడతారు. బిల్వచెట్టు ఎక్కడవుంటే అది  పవిత్రస్థానం.  బిల్వపత్రం మూడుగా చీలి కనిపిస్తుంది. ఆ మూడు ఆకులు కలిపి ఏర్పడిన తీరు శివుని త్రిశూలాన్ని పోలి ఉంటుంది. శివునికి ప్రీతిపాత్రమైనందునే ఆ రూపంలో ఆకులు ఏర్పడతాయి. యజుర్వేదంలో బిల్వవృక్ష ప్రస్తావన ఉంది. కాబట్టి ఇది పురాతనకాలంనుండి పూజలందుకుంటున్న చెట్టుగా గుర్తింపు పొందింది.

No comments:

Post a Comment