Thursday, March 14, 2019

బీరే నా ప్రపంచం అంటున్నా డెల్ …?

ఫ్లోరిడా న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
  • అన్నీ బంద్.. బీర్ మాత్రమే అతడి ఆహారం..
  • డెల్‌ను నమ్మని వ్యక్తులు అతడి వద్దకు వచ్చి మరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు..
ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెల్‌హల్ అనే వ్యక్తి ఆర్మీ అధికారిగా పనిచేశారు.  రిటైర్ అయిన తరువాత తాను ప్రజల్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని ఆశించారు. అయితే అందుకోసం ఏం చేయాలో అతడికి తెలియలేదు. ఓ రోజు ఎటువంటి ఘనపదార్థాలు తీసుకోకుండా కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగాడు. అలా నాలుగు రోజులు బీర్, నీళ్లు మాత్రమే అతడి ఆహరంగా మారింది. అలా నాలుగు రోజులు కాస్త 46 రోజులు అయ్యాయి. అన్ని రోజులు గడిచినా కూడా డెల్ కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగి బతుకుతున్నాడు. సోషల్ మీడియాలో డెల్ చేసే పని గురించి పోస్టు పెట్టాడు. చాలా మంది నెటిజన్లకు డెల్ చేస్తున్న పని పట్ల ఆసక్తి కలిగింది. కొంతమంది డెల్‌ను నమ్మని వ్యక్తులు అతడి వద్దకు వచ్చి మరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెల్ కేవలం బీర్, నీళ్లు మాత్రమే తాగుతున్నాడని వారు నిర్ధరించారు.

No comments:

Post a Comment