శ్రీకాకుళం, న్యూస్‌టుడే:
1) స్ధానిక వ్యాపారులకు బెదిరింపు ఫోన్లు.
2) రాజాం పట్టణంలోని వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తం.
2) రాజాం పట్టణంలోని వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తం.
ఈ మధ్య మీ వ్యాపారం బాగానే సాగుతున్నట్లుంది. మీ హస్త్రం ఇప్పుడే చూశాం. మీరు తక్షణమే రూ.10 వేలు చెల్లిం,చండి… లేదంటే మీ దుకాణాలపై దాడులు చేస్తాం ‘ అంటూ ఓ శాఖ అధికారుల పేరుతో స్ధానిక వ్యాపారులకు బెదిరింపు ఫోన్లు వస్తున్నట్లు సమచారం. . ఇప్పటికే రాజాం పట్టణంలోని ఒక కిరాణా వర్తకుడు, బిస్కెట్ల ఏజెన్సీ వ్యాపారి, ఫ్యాన్సీ-మెడికల్ వ్యాపారం నిర్వహించే మరొకరికి ఈ తరహా ఫోన్లు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది బయటకు పాకడంతో రాజాం పట్టణంలోని వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో ఈ తరహా బెదిరింపులు చూడని వర్తకులు తాజా పరిణామాల నేపథ్యంలో హడలిపోతున్నారు. ఫోన్లు చేస్తున్నది అధికారులు కాదని ప్రాథమికంగా వారిలో వారు రూఢి చేసుకుంటున్నా..మనసులో భయం మాత్రం పోవటం లేదు. ఇప్పటికి ముగ్గురికి ఫోన్లు రాగా, వీరిలో ఒకరు భయపడి ఆ వ్యక్తి చెప్పిన ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత మూడ్రోజులుగా ఈ తరహా ఫోన్లు వస్తున్నట్లు చెబుతున్నారు.
No comments:
Post a Comment