Tuesday, March 19, 2019

హత్యకు వారం ముందే వివేకా కు హెచ్చరిక……


కడప న్యూస్‌టుడే:
  • వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
  • వివేకా అనుచరులు గంగి రెడ్డి,పరమేశ్వర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది.
హత్యకు 15రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.బెంగళూరులో ఓ భూవివాదంలో వివేకా,గంగిరెడ్డి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.రూ.125కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వివాదం జరిగింది.ఈ డీల్‌లో రూ.1.5కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా చేస్తుంది.గంగిరెడ్డితో పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.వివేకా హత్యకు 15రోజుల ముందు పెంపుడు కుక్క అనుమాన స్పదంలో మృతి చెందింది.గత నాలుగు రోజులుగా రహస్య ప్రాంతంలో గంగిరెడ్డి విచారణ కొనసాగుతుంది.పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.10రోజుల్లో సంచలం చూస్తారని వైరి వర్గానికి పరమేశ్వర్ చెప్పారు.వారం ముందే “బీ కేర్‌ఫుల్”అని మెసేజ్ ఒక అఙ్ఞాత వ్యక్తి నుంచి వివేకాకు వచ్చింది.ఈ విషయాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది.

No comments:

Post a Comment