Wednesday, March 20, 2019

భాజపా లో మారుతున్న సమీకరణాలు……..

విశాఖపట్నం న్యూస్‌టుడే:
  • విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంపికలో సమీకరణాలు మారుతుండడం నగర భాజపా నాయకుల్లో ఉత్కంఠను రేపుతోంది.
  • తొలుత ఆ స్థానానికి పురందేశ్వరి పేరును ప్రతిపాదించారు.
విషయం తెలుసుకున్న హరిబాబు టిక్కెట్‌ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. గత ఎన్నికల సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కీలకపాత్ర పోషించిన ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడంతో పార్టీ కార్యకలాపాల నిర్వహణలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఎంపీగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ విస్తృత కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో పెద్ద నాయకులందరూ కూర్చొని విభిన్న కోణాల్లో ఆలోచించి గెలుపుగుర్రాలు ఎవరన్న విషయాన్ని ఖరారు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇవ్వగల వారెవరో నిశితంగా పరిశీలించిన అనంతరమే టికెట్టు ఇవ్వాలని తీర్మానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితోపాటు ప్రస్తుత ఎంపీ హరిబాబు పేరు కూడా చర్చకు వచ్చింది. విశాఖ నగరంలో ఐ.ఐ.ఎం., ఐ.ఐ.పి.ఇ., సమీర్‌ తదితర సంస్థలు విశాఖ రావడంతోపాటు విశాఖ నగరాన్ని స్మార్ట్‌సిటీగా కేంద్రం ప్రకటించింది. విశాఖ ప్రజల చిరకాల సెంటిమెంటుగా ఉన్న రైల్వేజోన్‌ను కూడా కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనకే మళ్లీ ఎంపీ టికెట్టు ఇస్తే ఎక్కువ ఓట్లు వస్తాయని భాజపాలోని కొందరు పెద్దలు భావిస్తున్నారు. మరికొందరు విశాఖ ఎంపీగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తెరపైకి తీసుకురావాలని వాదిస్తున్నారు.

No comments:

Post a Comment