పెద్దగుజ్జువాడ న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.ప్రయాణంలో అజాగ్రత్తల వల్ల ట్రాక్టర్ ఢీ.
సారవకోట మండలం మదనాపురం పంచాయతీ జరాళి గిరిజన గ్రామానికి చెందిన ఎనిమిది మంది చక్రతీర్థ స్నాన ఘట్టానికి ఆటోలో బయలుదేరారు. గ్రామం నుంచి ఆటో బయలుదేరిన సుమారు 20 నిమిషాల్లో జరిగిన ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జైనివలస లచ్చయ్య(49) అక్కడికక్కడే మృతిచెందారు. పెద్దగుజ్జువాడ కూడలికి ఆటో చేరుకోగానే ఎదురుగా వచ్చే ట్రాక్టరు ఢీకొంది. ఆటోను ట్రాక్టరు తొట్టె ఆటో వెనుక కూర్చున్న లచ్చయ్య ముఖానికి బలంగా తగలడంతో పాటు కొంతవరకు ఈడ్చుకుంటూ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టరు డ్రైవరు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.మృతునికి భార్య, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఉన్నారు.లచ్చయ్య మృతితో భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రామకృష్ణారావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment