శ్రీకాకుళం,న్యూస్‌టుడే,
1)ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు…….
2)ప్రభుత్వ వసతి సౌకర్యాలను వినియోగించుకోకూడదు…….
2)ప్రభుత్వ వసతి సౌకర్యాలను వినియోగించుకోకూడదు…….
శ్రీకాకుళం కోడ్.. జిల్లా అంతటా మార్మోగుతున్న పేరు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సామాన్యుడి దృష్టంతా దీనిపైనే ఉంది. విగ్రహాలు, పోస్టర్లు, బ్యానర్ల విషయంలోనే కాదు అధికారుల కదలికలు సైతం ఈ కోడ్ పరిధిలోకే వస్తాయి. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి అధికార పార్టీ పాల్పడకూడదు. ఎన్నికల ప్రచారం కోసం తన అధికార హోదాని దుర్వినియోగం చేశారనే అభియోగం తలెత్తకుండా కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ చూసుకోవాలి. ఎన్నికల పనికి గానీ, ప్రచారానికి గానీ పాలనా యంత్రాంగాన్ని, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.అధికారంలో ఉండే పాలకులు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ విశ్రాంత గృహాలు, బంగ్లాలు లేక ప్రభుత్వ వసతి సౌకర్యాలను వినియోగించుకోకూడదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రభుత్వ ఖజానా, ప్రజాధనం వెచ్చింది ప్రకటనలు, సంక్షేమ పథకాల ఆర్టికల్స్‌ను ప్రచురించకూడదు. ఇవ్వకూడదు. ఎన్నికల కోసం పక్షపాత పూరితమైన రాజ కీయ వార్తల కవరేజీ ప్రచారం కోసం ప్రభుత్వం మాస్ మీడియాని ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడకూడదు.ఎన్నికల సంఘం నిర్వహణ తేదీలు ప్రకటించినప్పటి నుంచి మంత్రలు, ఇతర అధికారులు తమ విచక్షణా నిధుల నుంచి ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయరాదు.ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఎటువంటి అడహక్ నియామకాలుగాని, కమిటీలుగాని జరపరాదు.
No comments:
Post a Comment