Wednesday, March 13, 2019

దేవాలయాలలో టీడీపీ బ్యానర్లు


చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…. 
*తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద టీడీపీ హోర్డింగ్…..
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టణంలో అధికార పార్టీ బ్యానర్లు విషయంలో అధికారులు పట్టీపట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సుప్రసిద్ద తిరుపతి గంగమ్మ దేవాలయం ప్రాంగణం తెలుగుదేశం పార్టీ నేతల బ్యానర్లకు చిరునామాగా మారిపోయింది.టీడీపీ కి చెందిన నేతలు ఇక్కడ పాలక వర్గ సభ్య్లుగా కొనసాగుతుండడంతో పట్టణంలో ఉన్న బ్యానర్లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి కోడ్ ను ఉల్లంగిస్తురున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రతి రోజు దేవాలయానికి వచ్చేభక్తులు, అమ్మవారి దర్శనం అనంతరం తెలుగుదేశం పార్టీ బ్యానర్లను దర్శించుకోవాల్సి వస్తోంది. ఆలయంలో ఎలాంటి ప్రచార హోర్డింగులు, బ్యానర్లు ఉంచరాదని కోడ్‌ స్పష్టంగా చెబుతున్నా, టీడీపీ నాయకులు ఇవేమి పట్టడంలేదు.

No comments:

Post a Comment