Saturday, March 9, 2019

70 ఏళ్లుగా ప్రత్యేకమైన రుచితో…

గుంటూరుజిల్లా:యడ్లపాడు: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…
  • సుబ్బమ్మ జిలేబి పక్కాలోకల్…
  • జిలేబీ రుచిని ఆస్వాదించలంటే సుబ్బమ్మదే..
  • నాణ్యతతో కూడుకున్న జిలేబి…
ఎంత గొప్ప స్వీత్ గురించైనా చెప్పండి. వెంటనే మనకి మైదా, పంచదార పాకలే గుతుకువస్తాయి. ఆ వెంటనే కెలొరీలు…అనారోగ్యం. అదే గుంటూరులోని సుబ్బమ్మ జిలేబి పేరు చెబితే మాత్రం వీటి గురించి ఆలోచించకుండానే ఆ జిలేబీని నోట్లో వేసుకుని ఆస్వాదిస్తారు. ఎందుకలా అంటే…. నిజమే ఎక్కడయినాజిలేబీ అంటే మైదానే ఎక్కువుగా ఉపయోగిస్తారు. దానికితోడు కంటికింపుగా కనిపించేందుకు రంగులు వేస్తారు. కానీ గుంటూరు జిల్లా యడ్లపాడులో సుబ్బమ్మ జిలేబీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. మరమిల్లులో కాకుండా రోట్లో దంచిన బియ్యప్పిండి, రంగులు వాడని శుద్ధమైన ఆర్గానిక్ బెల్లం, మైదాని ఏమాత్రం ఉపయోగించకుండా మినప్పిండితో చేయడం ఈ జిలేబి ప్రత్యేకం. అందుకే ఆ బ్రహ్మాడమైన రుచి అంటూ తిన్నవారు పొగుడుతుంటారు. డెబ్బేఇ సంవత్సరాల నుంచి ఇదే నాణ్యతని పాటిస్తున్నారు. సుబ్బమ్మ కుటుంబీకులు. మొదట్లో సుబ్బమ్మ భర్త ఎంకటపయ ఈ దుకాణాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత సుబ్బమ్మే నిర్వహించేవారు. దాంతో ఆమె పేరుతోనే ఈ జిలేబీ ప్రాచుర్యంలోకి వచ్చింది.

No comments:

Post a Comment