హైదరాబాద్ న్యూస్‌టుడే:
- భారీగా హవాలా సొమ్ము పట్టివేత…
- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల రూపాయలకు మించి ఎక్కువ వెంట ఉంచుకోవద్దని….
నగర కమిషనరేట్ పరిధిలో మరో హవాలా గుట్టురట్టయింది.ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ రాకెట్ ను చేదించి ..నలుగురు వ్యాపారుల నుంచి రూ.90.50 లక్షలను స్వాధినం చేసుకున్నారు.ఎన్నికల కోడ్ దృష్ట్యా కాచీగూడ సుల్తానాబాద్ పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు పోలీసులు చేపట్టారు.వేర్వేరుగా వాహానాల్లో నగదు తరలిస్తున్న వ్యాపారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.దేవేష్ కొటారి అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు స్వాధినం చేసుకోగా …భక్తిప్రజాపతి వద్ద రూ.23 లక్షలు,నసీమ్ వద్ద రూ.5.70లక్షలు,విశాల్ జైన్ వద్ద రూ.11.80 లక్షలను స్వాధినం చేసుకున్నట్లు నగర పోలీసు కముషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.వీటికి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపించలేదని చెప్పారు.వీరు గత కొంత కాలంగా వేర్వేరుగా హవాలా వ్యాపారం నిర్వహిస్తూ డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.వీరి వద్ద నుంచి మూడు క్యాష్ కౌంటింగ్ యంత్రాలతోపాటు నాలుగు ద్విచక్రవాహానాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల రూపాయలకు మించి ఎక్కువ వెంట ఉంచుకోవద్దని..అంతకంటే ఎక్కువ డబ్బు దానికి తగిన ఆథారాలు చూపాలని చెప్పారు.

No comments:
Post a Comment