Wednesday, March 13, 2019

140 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు…

న్యూస్‌టుడే:
అంతరించుకుపోయిందనుకున్న ఓ సర్పజాతిని 140 ఏళ్ళ తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారు. 2016-18 మధ్య మేఘమలై వన్య ప్రాణాల అభయారణ్యంలో సర్వే జరిపిన సమయంలో వుడ్ స్నేక్ కనిపించిందని హెర్పిటాలజిస్టు ఆర్. చైతన్య, బయోడైవర్సిటీ కన్సర్వేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ వరదా గిరి వెల్లడించారు. 235 మిల్లీ మీటర్ల పొడవులో ముదురు గోధుమ రంగులో ఈ ఆడపాము ఉందని చెప్పారు. కాగా ఈ వుడ్ స్నేక్ ను చివరిసారిగా 1878 లో సైనికాధికారి, ప్రకృతి శాస్త్రవేత్త అయిన కర్నల్ రిబర్ట్ హెన్రీ బెడ్డోం గుర్తించారు.

No comments:

Post a Comment