గుంటూరుజిల్లా: అమరావతి:
.* ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన.
* చిరంజీవి పై అధికారులు కేసు నమోదు.
*అక్రమమైన కేసును రద్దు చేయుట.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ సినీనటులు చిరంజీవి పై గుంటూరు అరండల్‌పేట్ ఠాకాలో2014 లో నమోదైన కేసును హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. రజనీ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 2014 ఏప్రిల్ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని దిగువ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్నారని పిటిషినర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి చిరంజీవి పై నమోదు చేసిన కేసును రద్దు చేశారు.
No comments:
Post a Comment