Thursday, March 7, 2019

జయలలిత మృతిపై పలు అనుమానాలు…


న్యూస్‌టుడే: చెన్నై ముఖ్యంశాలు:
  • అమ్మకు హల్వా తినిపించి మరీ చంపేశారని ఆరోపణలు…..
  • మంత్రి సివి షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు…
జయలలిత మృతిపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా తమిళనాడు న్యాయ శాఖ మంత్రి సివి షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మకు హల్వా తినిపించి మరీ చంపేశారని ఆరోపించారు. జయలలితది ముమ్మాటికి హత్యే అని విచారిస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. జయలలితకు షుగర్ ఉందని తెలిసి కావాలనే ఆమెకు హల్వాను తినిపించి, వ్యాధి ముదిరేలా చేసి ఆమె మరణాన్ని సహజంగా చిత్రకరించారని మండిపడ్డారు. శశికళను సరైన విధంగా విచారిస్తే అన్ని నిజాలు బయట పడతాయన్నారు.బూత్ పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న షణ్ముగం ఈ మేరకు స్పందించారు. అయితే, దివంగత సిఎం జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్‌ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ విచారణలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణన్‌ ఇచ్చిన వాంగ్మూలం, నివేదికలపై న్యాయశాఖ మంత్రి సివి షణ్ముగం విరుచుకుపడ్డారు.

No comments:

Post a Comment