Thursday, March 14, 2019

ఆవిర్భావదినోత్సవ సభ….

పశ్చిమ గోదావరి న్యూస్‌టుడే:
  • జనసేన కోకన్వీనర్ పార్టీకి రాజీనామా
  • ఎన్నికల శంఖారావం పూరించనున్నారు
జనసేన పార్టీలో రాజీనామాల షురూ అయ్యింది.పశ్చిమ గోదావరి జిల్లా కోకన్వీనర్‌ యర్రా నవీన్‌ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్ధులను ఎంపిక చేయడంలో పార్టీ నిర్ణయాన్ని సమర్ధించలేనని, అసంతృప్తి చెంది రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీలో కష్టపడిన వారిని వెనక్కునెట్టి ఇతర పార్టీల్లో టికెట్లు దక్కనివారు జనసేనలో చేరితే వారికి టికెట్లు ఇవ్వడం సరికాదని యర్రా నవీన్‌ వ్యాఖ్యానించారు.కాగా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రిలో జనసేన ఆవిర్భావదినోత్సవ సభ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభ నుంచే జనసేన అధినేత పవన్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సందర్భంగా పవన్‌ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

No comments:

Post a Comment