Saturday, March 16, 2019

‘గేట్’లో ప్రతిభ చాటిన మణికంఠ….!


శ్రీకాకుళం న్యూస్‌టుడే : 
1) స్టాటిస్టిక్స్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించి మణికంఠ.
2)జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.

జిల్లాకు చెందిన విద్యార్థులు వరుసగా ర్యాంకులు సాధిస్తూ జాతీయ స్థాయిలో ఖ్యాతిని చాటుతున్నారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి మణికంఠ పేరు తీసుకువచ్చారు. జలుమూరు మండలం సైరిగాం గ్రామానికి చెందిన పట్నాన సత్యం మాష్టారు, భూలక్ష్మిల తనయుడైన పట్నాన వెంకటరమణ మణికంఠ గేట్‌లో జాతీయ స్థాయిలో స్టాటిస్టిక్స్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించారు. మొదటి నుంచి గణిత శాస్త్రంపై ఆసక్తి ఉన్న ఆయన ఐఐటీ గౌహతిలో బి.టెక్‌ పూర్తి చేశారు. ఆ తరవాత ఐఐటీ కాన్పూరూలో ఎం.ఎస్సీ గణితశాస్త్రం చదువుతున్నారు. గత ఏడాది గేట్‌ పరీక్ష గణిత విభాగంలో రాసి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మణికంఠ ఈ ఏడాది కూడా గేట్‌లో స్టాటిస్టిక్స్‌ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని.. వీటిపై పరిశోధన చేయాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

No comments:

Post a Comment