Sunday, March 10, 2019

సినీ న‌టుడు ఆలీ వైసిపి లో న టిడిపిలో న….?

సినీ న‌టుడు ఆలీ వైసిపి లో చేరుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టిడిపిలో చేరుతున్నార‌ని గుంటూరు తూర్పు నియో జ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంత‌కు ముందు ఆయ‌న ప‌వ‌న్ తో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా జ‌న‌సేన లో చేరుతార‌ని జోర‌గా ప్ర‌చారం సాగింది. అయితే, మంత్రి గంటా తో భేటీ త‌రువాత టిడిపిలో చేరిక ఖాయ‌మ‌ని భావించారు. ఇప్పుడు స‌డ‌న్ గా ఆయ‌న వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా ఈ రోజు జ‌గ‌న్ కాకినాడ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేముందు వైసిపి లో చేర‌నున్నారు. ఆయ‌న విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం కోరుతున్న ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అక్క‌డ వైసిపి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఉన్నారు. టిడిపి నుండి జ‌లీల్ ఖాన్ కుమార్తెకు టిడిపి సీటు ఖ‌రారు చేసింది. దీంతో..అలీని అధికారికంగా పార్టీ అభ్య‌ర్దిగా ఎక్క‌డి నుండి బ‌రిలోకి దించుతార‌నే ది వేచి చూడాల్సిందే..

No comments:

Post a Comment