Wednesday, March 6, 2019

మ‌హాన‌గ‌రంలో సైబ‌ర్ కేటుగాళ్లు..!!

హైదరాబాద్ : విశ్వ‌న‌గ‌రంగా రూపాంత‌రం చెందుతున్న హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మోసాలు కూడా బాగానే విస్త‌రిస్తున్నాయి. ర‌క‌ర‌కాల రూపాల్లో అనేక మోసాలు న‌గ‌ర‌వాసుల‌ను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కొత్త కొత్త అవ‌తారాల్లో జ‌నాన్ని మోసం చేసేందుకు మోస‌గాళ్లు చిత్ర విచిత్ర వేశాలు వేస్తున్నారు. ఒక మోసం ఆట‌క‌ట్టించారు పోలీసులు అనుకునే లోపు మ‌రో కొత్త త‌ర‌హా మోసం వెలుగులోకి వ‌స్తోంది. సామాన్య ప్ర‌జానికం ఆశ‌లు, కోరిక‌ల‌నే పెట్టుబ‌డిగా ఈ కేటుగాళ్లు త‌మ దుకాణాల‌ను తెరిచి విచ్చ‌ల విడి నేరాల‌కు పాల్ప‌డుతూ పోలీసుల‌కు స‌వాల్ గా ప‌రిణ‌మిస్తున్నారు. న‌గ‌రంలో తాజాగా కారు చౌక‌గా కార్లు అందిస్తామ‌ని, ల‌క్కీ లాట‌రీలో డ‌బ్బు గెలుచుకున్నారంటూ అనేక మందిని సైబ‌ర్ మోసగాళ్లు చేసిన మోసం వెలుగులోకి వ‌చ్చింది

No comments:

Post a Comment