గొడుగుపేట న్యూస్‌టుడే:
1.టీఅన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ …..
2.అజ్మీర్‌యాత్రకు ప్రత్యేకంగా ఏర్పాట్లు….
అజ్మీర్‌యాత్ర పుణ్యప్రదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అజ్మీర్‌యాత్రకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలును ఆయన ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు ప్రభుత్వాలు కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయనతోపాటు యాత్రికుల కుటుంబ సభ్యులు వివిధ పక్షాల నాయకులు పెక్కుసంఖ్యలో రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మంత్రి తదితరులు ముస్లింలతో కలిసి అజ్మీర్ దర్గాలో సమర్పించే చాదర్‌తో ఇనుగదురుపేట జెండా సెంటరు నుంచి ఆయా కూడళ్ల మీదు రైల్వేస్టేషన్‌వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ బాబాప్రసాద్, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఇలియాస్‌పాషా, అబ్దుల్‌అజీమ్, షేక్‌అమీర్, ఖాజా, ఖాజాబేగ్, యండూరి సురేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య దంపతులు ప్రత్యేక ప్రార్థ.నలు నిర్వహించిన చాదర్ సమర్పించారు. మున్సిపల్ ప్రతిపక్ష నేత అచ్చాభా,షేక్‌సిలార్‌దాదా, శీలం మారుతీరావు, మేకల వెంకటసుధాకర్, అస్గర్‌అలీ, గూడవల్లి నాగరాజు, రఫీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment