Thursday, March 7, 2019

ఓట్ల తొలిగింపుపై ఫిర్యాదు…..

అనంతపురం న్యూస్‌టుడే:
  • ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ గెలుపు ఖాయమన్న సునీత.
రాప్తాడు నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగిందని రాష్ట్రమంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం సీ ఈ వో ద్వివేదిని కలిసి ఓట్ల తొలగిపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… నా నియోజక వర్గమైన రాప్తాడులోని ఆయా మండలాల్లో మొత్తం 18, 159 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేసి ఉన్నాయన్నారు. వైసీపీ నేతలు ప్రజాక్షేత్రంలో గెలవలేక అక్రమ మార్గలను ఎంచుకున్నారని, ప్రజలు ఈ విషయాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు.

No comments:

Post a Comment