చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..
*భార్య పేరుపై వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇతరత్రా స్కీముల కింద రూ.1.32కోట్లు ఉన్నట్లు, ఇందులో బంగారం 960 గ్రాములు ఉండగా విలువ రూ.20లక్షలగా పేర్కొన్నారు…..
చిత్తూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి ఎన్.శివప్రసాద్ ఆస్తుల కంటే ఆయన సతీమణి విజయలక్ష్మీ ఆస్తులు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరు లోక్‌సభ స్థానానికి ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన, సతీమణి స్థిర, చర ఆస్తులను అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఎన్.శివప్రసాద్ పేరుపై రూ.13లక్షల విలువైన కారు, సతీమణి పేరుపై రూ.7.50లక్షల విలువైన కారు ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు, బంగారం మొత్తం విలువ రూ.63,57,412గా పేర్కొన్నారు. వీటిలో 50గ్రాముల బంగారం విలువ రూ.1.50 లక్షలుగా పేర్కొన్నారు. భార్య పేరుపై వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, ఇతరత్రా స్కీముల కింద రూ.1.32కోట్లు ఉన్నట్లు, ఇందులో బంగారం 960 గ్రాములు ఉండగా విలువ రూ.20లక్షలగా పేర్కొన్నారు. శివప్రసాద్ పేరిట చంద్రగిరి మండలం పులిర్తివారిపల్లె వద్ద రూ.10లక్షలు విలువ చేసే పొలం ఉండగా.. సతీమణి పేరుపై చంద్రగిరి మండలం అగరాల వద్ద వ్యవసాయ భూమితో పాటు.. పలుచోట్ల ఇంటి స్థలాలు, ఇతరత్రా ఆస్తులు విలువ రూ.4.90కోట్లు ఉన్నట్లు చూపారు. ప్రస్తుతం శివప్రసాద్ చేతిలో రూ.2లక్షలు నగదు ఉండగా.. ఆయన భార్య చేతిలో రూ.లక్ష ఉంది. ఆయన 2017-18లో రూ.8.25లక్షలు ఆదాయపు పన్ను చెల్లించగా.. సతీమణి రూ.21.34లక్షలు చెల్లించారు.

No comments:
Post a Comment