గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు...
- ప్రచారానికి మిగిలింది ఇక మూడు వారాలే…
- ఎక్కడ సభ పెట్టారో ఆ ప్రాంత విశిష్టత, ఆ ప్రాంతానికి ప్రభుత్వం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు…
- ప్రచారానికి మిగిలింది ఇక మూడు వారాలే…
- దీంతో నేతలకు ప్రసంగాలకు పదునుపెడుతున్నారు. చంద్రబాబు ఈ విషయంలో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.
- తన గత ప్రసంగాలకు భిన్నంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాను చెప్పాలనుకున్న విషయాలతోపాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రజలముందు ఉంచుతున్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఏం చెప్పాలనుకున్నారో అది స్పష్టంగా చెబుతారు. అయితే ఆ ప్రసంగం ఆసక్తికరంగా మారడానికి ఈ మధ్య కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రచారం మొదలైన మూడు రోజుల్లోనే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధితోపాటు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఎక్కడ సభ పెట్టారో ఆ ప్రాంత విశిష్టత, ఆ ప్రాంతానికి ప్రభుత్వం చేసిన ప్రత్యేక కార్యక్రమాలను ఏకరువుపెడుతున్నారు. అలాగె ప్రసంగాల్లో కొన్ని అంతర్జాతీయ విశేషాలు సయితం ప్రస్తావించడం తాజా విశేషం. ట్రెండ్‌కు తగినట్టుగా ప్రసంగంలో చంద్రబాబు మార్పులు చేశారు.

No comments:
Post a Comment