వాషింగ్టన్ న్యూస్‌టుడే:
- చైనా తీరుపై అమెరికా ఆగ్రహం
- దీనికి కారణాలను మాత్రం చెప్పలేదు.
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను చైనా మరోసారి అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపై చర్చ జరగగా. వీటో అధికారం ఉన్న చైనా చివరి నిమిషంలో ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం గమనార్హం. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. పుల్వామా దాడి తర్వాత అమెరికా, ఫ్రాన్స్, యూకే దేశాలు మసూద్ అజర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలన్న తీర్మానాన్ని సెక్యూరిటీ కౌన్సిల్ ముందు ఉంచారు. అయితే ఈ తీర్మానానికి అడ్డుపడిన చైనా.. దీనికి కారణాలను మాత్రం చెప్పలేదు. చైనా తీరుపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ఇలాగే చేస్తుంటే.. కౌన్సిల్‌లోని ఇతర సభ్య దేశాలు ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, పరిస్థితి అంత వరకు రాకుండా చూసుకుంటే మంచిది అని అమెరికా హెచ్చరించింది. ఈ ప్రతిపాదనను చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి.
No comments:
Post a Comment