Monday, March 11, 2019

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రధానం…..

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 2019 ఏడాదికి గానూ 112 మంది పేర్లతో పద్మ అవార్డులను(పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ) ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మ అవార్డులు అందుకున్న వారిలో కుల్దీప్‌ నయ్యర్‌ భార్య భారతీ నయ్యర్‌, ప్రభుదేవా, శంకర్‌ మహాదేవన్‌, శివమణి, హారిక ద్రోణవల్లి, భజరంగ్‌ పునియా, ఎడపల్లి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అందుకున్నారు. ప్రముఖ జర్నలిస్ట్‌ కుల్దీప్‌ నయ్యర్‌కు మరణానంతరం పద్మ భూషణ్‌ను ప్రకటించారు.

No comments:

Post a Comment