Thursday, March 14, 2019

ఐటీ తో భావితరాలు సూపర్……


సంగివలస(తగరపువలస), న్యూస్‌టుడే:
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య కందుల నిరంజన్‌ అన్నారు.
  • సంగివలస అనిట్స్‌ ఇంజినీరింగు కళాశాల ఐటీ అండ్‌ సైన్సు విభాగం, కంప్యూటరు సొసైటీ ఆఫ్‌ ఇండియా, హీలియోస్‌ సంయుక్తాధ్వర్యంలో గురువారం ప్రారంభమైన రేడియంట్‌ 2కే19 రెండ్రోజుల జాతీయస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.
  • ఐటీ విద్య సమాజశ్రేయస్సుకి ఉపయోగపడేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం సావనీర్‌ని ఆవిష్కరించారు.
  • అనిట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌బీఆర్‌ ప్రసాద్, ప్రిన్సిపల్‌ ఆచార్య టి.సుబ్రహ్మణ్యం, ఐటీ విభాగాధిపతి సురేశ్‌ చిట్టినేని, తదితరులు పాల్గొన్నారు.  

1 comment: