Wednesday, March 20, 2019

దోంగలు వస్తున్నారు జగ్రత్త


తూర్పు గోదావరి    పిఠాపురం, న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
*నాగేశ్వరరావు ఇంట్లో మూడు కాసుల బంగారం, రూ.10 వేలు నగదు అపహరించారు..
పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని రెండు ఇళ్లలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుత్తేదారుడైన చక్కపల్లి రామస్వామి గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
మంగళవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగల కొట్టి ఉన్నాయి.
బీరువాలోని రూ.40 వేలు నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో విశ్రాంత ఉపాధ్యాయుడు పొటంశెట్టి నాగేశ్వరరావు ఇంట్లో మూడు కాసుల బంగారం, రూ.10 వేలు నగదు అపహరించారు. బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రైం బృందం ఆయా ఇళ్లల్లో తనిఖీలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment