Friday, March 15, 2019

టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా….


అభినవ్ సర్దార్, సాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మ్యాగ్నెట్’. ఆది శేషా సాయిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సి.కళ్యాణ్ మాట్లాడుతూ “మ్యాగ్నెట్ ట్రైలర్ చూస్తుంటే టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు ఆది శేషా సాయి రెడ్డి మాట్లాడుతూ “విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాం. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది”అని చెప్పారు. హీరోయిన్ సాక్షి చౌదరి మాట్లాడుతూ “హీరోయిన్‌గా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించాడు. సినిమా సూపర్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కిషన్ కవాడియా, వెలిగొండ శ్రీనివాస్, నవీన్, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.
                                                                                    

No comments:

Post a Comment