సారవకోట శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ….
2.ఎన్టీఆర్ వైద్యసేవ క్రింద గతంలో…
3.గ్రహణమొర్రి ఉన్నవారికి శ్రీకాకుళంలోని …
ముఖ్యమంత్రి బాలసురక్ష పథకం క్రింద విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు గుర్తించడానికి వీలుగా జిల్లాలో 27 వైద్యబృందాలు పాఠశాలల వారీగా పర్యటించినట్టు ఆర్బీఎస్కే జిల్లా సమన్వయకర్త డా. మెండ ప్రవీణ్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం సారవకోట పీహెచ్‌సీని సందర్శించారు.పుట్టుకతో వచ్చిన బుద్ధిమాంద్యం, అంధత్వం, నరాల సమస్య ఉన్నవారిని కూడా వైద్యబృందాలు గుర్తించాయని.. ఆయా విద్యార్థులను పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యాధికారులు మరోసారి పరిశీలిస్తారని.. అనంతరం శస్త్రచికిత్సల కోసం ఎంపిక చేసి ఆసుపత్రులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి భార్గవప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment