రాంఛీ న్యూస్‌టుడే:
రాంఛీలో జేఎస్‌సీఏ స్టేడియం వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1.30గంటలకు ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మూడో వన్డే జరుగనుంది. ఆసీస్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత్.. వన్డే సిరీస్‌ను విక్టరీలతో స్టార్ట్ చేసింది. తొలి రెండు వన్డేల్లోనూ గెలుపొందిన టీమిండియా ఇవాళ మూడో మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ చేజారనివ్వకూడదన్న లక్ష్యంగా కంగారూలు బరిలోకి దిగనున్నారు. మరోవైపు.. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుండడం ఆసీస్‌ను కలవరపెడుతోంది. మధ్య ఓవర్లలో భారత స్పిన్‌ను ఎదుర్కొంటూ స్ట్రయిక్‌ను రొటేట్ చేసుకోవడంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నారు. టీ20ల్లో రెచ్చిపోయిన మ్యాక్స్‌వెల్.. మరోసారి సత్తాచాటితే భారత్‌కు ఇబ్బందే. ఏదిఏమైనా ఇవాళ్టి మ్యాచ్ ను గెలుపొంది వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంటుందేమో వేచి చూద్దాం.
No comments:
Post a Comment