Friday, March 8, 2019

డైట్ కాలేజీలో రాజాం రచయితల వేదిక

విజయనగరం న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…
*శివసాయి డైట్ కాలేజీలో రాజాం రచయితల వేదిక  ఆధ్వర్యంలో “తెలుగు మాట-వెలుగు బాట”కార్యక్రమం.
*శిక్షణ పొందుతున్న విద్యార్థులందరూ తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలని సూచించారు.
బొబ్బిలిలోని శివసాయి డైట్ కాలేజీలో రాజాం రచయితల వేదిక ఆధ్వర్యంలో “తెలుగు మాట-వెలుగు బాట”కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడిన రచయితల వేదిక సభ్యుడు గార రంగనాధం ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థులందరూ తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment