ప్రకాశం:న్యూస్‌టుడే:
1)టిన్యూస్ 10 ఆన్ లైన్ ఎడిషన్…..
2)ఓ అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ కు సమాచారం………
3)చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాలు………
2)ఓ అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ కు సమాచారం………
3)చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాలు………
ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. చీరాల మండలం ఈపూరుపాలెంలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్టణం చెందిన యువకుడితో బుధవారం వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఓ అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ నంబరు 1098కు సమాచారం ఇచ్చారు. దీంతో చైల్డ్‌లైన్, హెల్ప్ సంస్థ ప్రతినిధులు, బాలికల సంరక్షణ ఫెసిలిటేటర్ మణెమ్మ, క్రీడ్స్ వలంటీర్ డేవిడ్ రాజు స్పందించారు. ఐసీడీఎస్ అధికారులు నాగమణి, విజయకుమారి సహకారంతో సదరు బాలిక గృహానికి చేరుకుని… తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్యవివాహం నేరమని, చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం వివాహాన్ని నిలుపుదల చేస్తున్నట్లు వారి నుంచి హామీ పత్రం తీసుకున్నట్లు చైల్డ్‌లైన్ ప్రతినిధులు తెలిపారు.

No comments:
Post a Comment