Wednesday, March 6, 2019

ఎస్సై దెబ్బలకు మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యాయత్నం….

కర్నూలు న్యూస్‌టుడే: దేవనకొండలోని నరసప్ప అనే వ్యక్తి బుధవారం వేకువజామున పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో వెళ్లారు. గుర్తించిన బంధువులు, స్థానికులు కర్నూలు ఆస్పత్రికి స్థానిక ఎస్సై పీరయ్య మంగళవారం విచారణలో భాగంగా నరసప్పను చిత్రహింసలకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని వాపోయారు. ఈ ఘటనపై ఎస్సై పీరయ్యను న్యూస్‌టుడే వివరణ కోరగా బాధితుడు నరసప్ప తన సోదరి కనబడటం లేదని మంగళవారం కుటుంబసభ్యులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చారన్నారు. అమ్మాయి ఫొటో తీసుకురావాలని చెప్పడంతో వెనుదిరిగారన్నారు. కాగా తమ అమ్మాయి కనిపించకుండా పోవడానికి కారకులుగా అనుమానిస్తున్న వారి ఇంటిపైకి నరసప్ప బంధువులు వెళిదాడి చేశారని వివరించారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దానిలో భాగంగానే అతనిని విచారించామని, తాను కొట్టడం వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనడం అవాస్తవమన్నారు. తాను అతనిని కొట్టలేదన్నారు.
                                                           

No comments:

Post a Comment