Thursday, March 14, 2019

పోలవరం పై విచారణ 25 కి వాయిదా….

గుంటూరు న్యూస్‌టుడే:
  • పోలవరం ప్రాజెక్ట్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించాలి.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున, దాని నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఆదేశిచాలని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్ట్ ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ శుక్రవారం చేపట్టింది. విభజన చట్టం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రమే పూర్తి చేయాల్సి ఉండగా, నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2014 సంవత్సరం ధరల ప్రకారమే బిల్లులు చెల్లిస్తామని కేంద్రం మెలిక పెడుతోందని తెలిపారు. ప్రస్తుత రేట్ల ప్రకారమే బిల్లులు చెల్లించాలని ఆ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్ట్‌ను అభ్యర్థించారు.  తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది.
                                                                                      

No comments:

Post a Comment