బెంగళూరు: మహమ్మారి వ్యాది H1N1 బెంగళూరు నగరంలో వ్యాపించిందని స్పష్టంగా వెలుగు చూడటంతో ప్రజలు, వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే H1N1 39 కేసులు గుర్తించామని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యాదివ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తగా శుభ్రత పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు మనవి చేశారు.
H1N1 వ్యాది వచ్చిన నెలరోజుల తరువాత అది బయటపడుతుంది. ఈ వ్యాది గుట్టుచప్పుడు కాకుండా వ్యాపిస్తుందని అధికారులు అంటున్నారు. ఈ వ్యాది ఎలా వ్యాపిస్తుంది, ఆ రోగం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వైద్యశాఖ అధికారులు ప్రజలకు వివరించడానికి ప్రత్యేక వైద్యశిభిరాలు నిర్వహిస్తున్నారు. 2018లో బెంగళూరు నగరంలో H1N1 వ్యాది 64 మందికి వ్యాపించడంతో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెంగళూరు నగరంలో 6 డెంగ్యూ కేసులు, 7 చికెన్ గూన్యా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి డాక్టర్ పీకే. సునందా స్పష్టం చేశారు.

No comments:
Post a Comment