Thursday, February 28, 2019

ప్రముఖుల విషయంలో కేర్ …

ఒంగోలు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు:
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  • 13 జిల్లాలకు చెందిన 87 మంది రిజర్వు,  ఎస్‌.ఐ.లు,…
  • కానిస్టేబుళ్లకు 12 రోజుల శిక్షణ కార్యక్రమం….
  • శిక్షణకు హాజరైన వారంతా 30 నుంచి 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం..
  • గుంటూరు రేంజి ఐజీ ఆర్‌.కె.మీనా హెచ్చరించారు…..
దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యహరించినా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని గుంటూరు రేంజి ఐజీ ఆర్‌.కె.మీనా హెచ్చరించారు. ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో సెక్యూరిటీ విభాగంలో ఉన్న 13 జిల్లాలకు చెందిన 87 మంది రిజర్వు,  ఎస్‌.ఐ.లు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు 12 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమమైంది. ఐజీ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణకు హాజరైన వారంతా 30 నుంచి 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. అనుమానిత వ్యక్తుల కదలికలపై ఓ కన్నేసి ఉండాలని సూచించారు. 12 రోజుల పాటు జరిగే శిక్షణలో ప్రముఖుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తారని, పీటీసీ ఇన్‌ఛార్జి ప్రధానాచార్యులు పి.బిజోయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌,  సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీ టి.రామ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment