ఒంగోలు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….
- టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
- అంధులకు సంబంధించి ఎనిమిది ఉద్యోగాలు,…
- మార్చి 31వతేదీలోగా అర్హులైన విభిన్న…
- ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు…
వ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ కలెక్టర్ వినయ్‌చంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19కి సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంధులకు సంబంధించి ఎనిమిది ఉద్యోగాలు, బధిరులకు రెండు పోస్టులు కేటాయించారు. మార్చి 31వతేదీలోగా అర్హులైన విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు బి.సింగయ్య తెలిపారు. అంధుల కోసం జూనియర్ సహాయకులు 1, టైపిస్టు 2, జూనియర్ స్టెనో టైపిస్టు 1, మ్యాట్రన్ కం స్టోర్ కీపర్ 1, ల్యాబ్ టెక్నిషియన్ 1, ఆఫీస్ సబార్డినేట్ 1చొప్పున పోస్టులు ఉన్నాయన్నారు. బధిరులకు జూనియర్ స్టెనో 1, ఎంపీహెచ్‌ఏ స్త్రీ కేటగిరీలో ఒక పోస్టు ఉందని వివరించారు. దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

No comments:
Post a Comment