Thursday, February 28, 2019

ఎక్కడైనా ఉన్నాడా ఈ సాహసవీరుడు….


అద్దంకి న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు: 
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
  •  ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ..
  • పోలియో వ్యాధి బారిన పడి మిగిలిన వాళ్లలా ..
  •  చెన్నై పట్టణం నుంచి భూటాన్‌ వరకు సైకిల్‌యాత్ర చేయాలని ..
  • సంతోష్‌ కుమార్‌ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు….
చెన్నైలో నివసించే తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం అతను. తండ్రి దర్జీగా పని చేస్తుండగా తల్లి ఇస్త్రీ బండి నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి కుమారుడు సతీష్‌ కుమార్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చెన్నైలోని అన్నవేలాంగిని పాఠశాలలో పని చేస్తున్నారు.  ఈ క్రమంలోనే పోలియో వ్యాధి బారిన పడి మిగిలిన వాళ్లలా జీవితాలను గడప లేకపోతున్న కొందరిని అతను చూశారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణం నుంచి భూటాన్‌ వరకు సైకిల్‌యాత్ర చేయాలని సంతోష్‌ కుమార్‌ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, ఒడిశా, పశ్చిమ్‌బంగ, జార్ఖండ్‌, బిహార్‌, నేపాల్‌ మీదుగా భూటాన్‌ చేరుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. సంతోష్‌ కుమార్‌ 3232 కి.మీ. దూరాన్ని ఏప్రిల్‌ మొదటి సతీష్‌ కుమార్‌ గతేడాది మే నుంచి జూన్‌ మాసం మధ్యలో చెన్నై నుంచి న్యూఢిల్లీకి సైకిల్‌ యాత్ర చేశారు. అప్పుడు 28 రోజుల పాటు 2400 కి.మీ. ప్రయాణం సాగింది. సేవా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలనే తలంపుతో ఈ పర్యటన సాగిస్తున్నట్టు ఆయన వివరించారు. భవిష్యత్తులో భారత్‌ నుంచి యూరప్‌నకు సైకిల్‌ యాత్ర చేస్తానంటున్నారు  సంతోష్‌ కుమార్‌.

No comments:

Post a Comment