Thursday, February 28, 2019

బీరు ప్రియుల‌కు ఇబ్బందే..! గొంతు త‌డుపుకోవ‌డం క‌ష్ట‌మే..!

హైదరాబాద్ : ఇది ఖ‌చ్చితంగా బీరు ప్రియుల‌కు చేదు వార్తే..! వేస‌వి తాపం పెరుగుతోంది. సాయంత్రానికి జిహ్వ చాప‌ల్యం ఉన్న మందు బాబులు కాస్త బీరుతో గొంతు త‌డుపుకోవ‌చ్చనుకుంటే అది ఇక కుద‌ర‌ని ప‌ని. బీరు తాగకండి. కావాలంటే మద్యం తాగండి అంటూ హుకుం జారీ చేస్తోంది రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ. ఇది వినడానికి వింతగానే ఉన్నా అదే పోకడను ప్రదర్శిస్తోంది. నిజానికి దేశంలోనే బీరు ఎక్కువ వినియోగంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడి మందుబాబులు బీరే ఎక్కువ ఇష్టపడతారు. ఎండాకాలంలో బీరు విక్రయాలు మ‌రింత జోరుగా ఉంటాయి. కానీ ఎక్సైజ్‌ శాఖ కేవ‌లం అద‌న‌పు ఆదాయం కోసం క‌క్కుర్తి ప‌డుతూ బీరు విక్రయాలను త‌గ్గిస్తూ మద్యం అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది.
కానీ ఆరోజు 25 శాతం బీరు, 75శాతం మద్యం సరఫరా చేస్తామని చెబుతుండడంతో తమకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. బుధవారం మొత్తానికే బీరు సరఫరా చేయలేదని, గురువారం 25శాతం బీరుతో ఎలా సరిపెట్టుకుంటామని అంటున్నారు. ఒకపక్క వేసవి తాపంతో బీరు విక్రయాలు పెరిగాయని, ఇలాంటి సందర్భంలో విక్రయాలు పెంచుకోవాలని ఆలోచించాలి గానీ తగ్గించుకోవాలంటూ ఆదేశించడం ఇదెక్కడి వింత ధోరణి అంటూ యజమానులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment