చిత్తూరు న్యూస్‌టుడే:
- స్వచ్చ సర్వేక్షన్ పోటీలో తమదే మొదటిస్థాన అంటున్నా తిరుపతి నగరపాలక సంస్థ.
- రాష్ట్రస్థాయిలో రెండో అవార్డు దక్కించుకోవడం విశేషం.
స్వచ్చ భారత్ సర్వేక్షణ్ -2019పోటీలో తిరుపతి నగరపాలక సంస్థ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకోనుంది.దేశంలో ని 4,237నగరాలు,పట్టణాలు పోటీ పడిన స్వచ్చ సర్వేక్షణ్ పోటీలో తిరుపతికి ఉత్కంఠ భరిత ర్యాంకు లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకునేందుకు తిరుపతి నగరపాలిక కమిషనర్ విజయ్ రామరాజుకు ఆహ్వానం అందింది. జాతీయ స్థాయిలో ఎన్నోస్థానలలో ఉన్నామనే విషయం అవార్డుల ప్రదానం రోజే ప్రకటించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్-2017 పోటీలో తొమ్మిదోస్థానం, 2018 పోటీలో ఆరోస్థానంలో నిలిచిన తిరుపతి నగరం.. మెరుగైన ర్యాంకు సాధనకు ఆరునెలల పాటు శ్రమించి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేసింది. నగరాన్ని చెత్తకుండీ రహితంగా తీర్చిదిద్దడం, మురుగునీటి శుద్ధి కేంద్రం ఆధునికీకరణ, ఆర్‌ఎఫ్‌ఐడీ విధానంలో ఇంటింటి చెత్త సేకరణ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో శరవేగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించి అవార్డులను అందజేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు అవార్డుల ప్రదానోత్సవాల తేదీలను ప్రకటించింది. తిరుపతి నగరంలో జనవరి 4 నుంచి 31 వరకు జరిపిన పరిశీలనల ఫలితాలను కేంద్ర ప్రభుత్వం మదించగా.. రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులను దక్కించుకోవడం విశేషం.

No comments:
Post a Comment