ప్రకాశం న్యూస్‌టుడే :ముఖ్యాంశాలు :
- టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడి్‌షన్
- ప్రభుత్వ భూముల్లో గత నాలుగు రోజులుగా ..
- ముసీనది గర్భంలోకి పైపులు వేసి….
- కొండ పోరంబోకు భూముల్లో పరిశ్రమల వ్యర్థాలు…
చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం సమీపంలో యర్రకొండ దిగువ భాగంలో వ్యవసాయ భూములకు పక్కనే ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తెచ్చి పోస్తుండటంతో రైతులతో పాటు స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. చీమకుర్తి, మర్రిచెట్లపాలెం ప్రాంతాల్లో విస్తరించిన వందలాది గ్రానైట్ పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడ పోసేస్తున్నారు. రహదారుల అంచులు, వాగులు, వంకలు, సాగర్ కాలువ కట్టల అంచుల్లో పెద్ద ఎత్తున వీటిని కుమ్మరిస్తున్నా.. చీమకుర్తి పొదిలి మండలాలకు సరిహద్దున ప్రవహిస్తున్న ముసీనది గర్భంలోకి పైపులు వేసి మరీ ఈ వ్యర్థాలను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని మర్రిచెట్లపాలెం తూర్పు వైపున ఉన్న యర్రకొండ (ఎద్దులకొండ) దిగువ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో గత నాలుగు రోజులుగా ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తెచ్చి పోస్తున్నారు. ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో గ్రానైట్ పరిశ్రమల వ్యర్థాలు పోసేందుకు అనుమతులు ఎవరిచ్చారని వారు నిలదీస్తున్నారు.అధికారులు తగిన చర్యలు చేపట్టి కొండ పోరంబోకు భూముల్లో పరిశ్రమల వ్యర్థాలు పోయకుండా చూడాలని వారు కోరుతున్నారు.

No comments:
Post a Comment