ప్రకాశం అర్థవీడు, న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడి్‌షన్
2. అటవీ ప్రాంతంలో నీటి కుంట వద్ద దొడ్లు,…
3.పశువులను మేపుకొని జీవనం సాగించే ..
పశువులను అటవీ ప్రాంతాల్లో మేపుకొంటూ తాగునీరున్న చోట గుడిసెలు ఏర్పాటు చేసుకోగా- వాటిని అటవీశాఖ సిబ్బంది నిప్పు పెట్టిన సంఘటన గురువారం అర్థవీడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు… అచ్చంపేట, బొల్లుపల్లి, పాపినేనిపల్లి గ్రామాలకు చెందిన పశువుల కాపర్లు ఇందిరానగర్ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో నీటి కుంట వద్ద దొడ్లు, గుడిసెలు వేసుకున్నారు. పగలంతా పశువులను మేపుకొని… రాత్రి అక్కడే నివసించేవారు.పశువులను మేపుకొని జీవనం సాగించే తమను అధికారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లనీయడం లేదని బాధితులు తత్తూరి దేవమ్మ, ఏశమాల దేవయ్య, కొమిరే రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై గిద్దలూరు అటవీశాఖ డీఎఫ్‌వో సతీష్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా… పశువుల దొడ్లు కాలిపోయిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

No comments:
Post a Comment